భారత ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు సంఖ్యను పెంచిన సౌదీ

- March 12, 2017 , by Maagulf
భారత  ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేందుకు  సంఖ్యను పెంచిన సౌదీ

ముస్లింలు మక్కా వెళ్లడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్నే హజ్ యాత్ర అంటారు. ప్రతీ సంవత్సరం సౌదీ ప్రభుత్వం ఒక్కొ దేశం నుంచి ఈ హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను నిర్ణయిస్తుంది. అయితే ఈ సంవత్సరం మన దేశం నుంచి హజ్ యాత్రకు వచ్చేవారి సంఖ్యను సౌదీ ప్రభుత్వం పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జనవరిలోనే విడుదల చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా మార్చ్ 9 వరకు హజ్ యాత్రకు వెళ్లదలచుకున్నవారు దరఖాస్తులు చేసుకున్నారని భారత మైనారిటీ వ్యవహరాల శాఖ పేర్కొంది. మార్చ్14న డ్రా ద్వారా హజ్ యాత్రికులను ఎంపిక చేస్తామని అధికారులు సౌదీ ప్రభుత్వానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గతంలో 2052 మంది హజ్ యాత్రకు వెళ్లారు. ప్రస్తుతం ఈ సంఖ్యను ప్రస్తుతం 2728కు పెంచారు. తెలంగాణ నుంచి గతంలో 2532 మంది వెళ్తే, ప్రస్తుతం వీరి సంఖ్యను 3367కు పెంచారు. కేరళ నుంచి అత్యధికంగా హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. రెండవస్థానంలో మహరాష్ట్ర, తర్వాతి స్థానాల్లో గుజరాత్, కర్ణాటకలు ఉన్నాయి. మొత్తానికి ఈ సంవత్సరం భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి సంఖ్యను 34,005గా సౌదీ ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com