కతర్ 'నిర్మాణ రంగంలో ఓ విప్లవం' చల్ల చల్లని హెల్మెట్లు

- March 12, 2017 , by Maagulf
కతర్ 'నిర్మాణ రంగంలో ఓ విప్లవం'  చల్ల చల్లని హెల్మెట్లు

మండే ఎండలలో...విపరీతమైన ఉక్కపోత పొసే సమయంలో నెత్తి మీద హెల్మెట్ పెట్టుకొంటే...తల కోడిగుడ్డు మాదిరిగా ఉడికిపోవడం ఖాయం..ఆ అనుభవం నిజంగా ' హెల్ మెట్టు ' ఎక్కిన మాదిరిగానే ఉంటుంది. అయితే ఇకపై  హెల్మెట్లు నరకానికి మెట్లు కాక ఇక చల్లని అనుభూతికి పట్టు కానుంది.  కతర్ లో ఓ చల్ల చల్లని హెల్మెట్ లు కార్మికులకు అందుబాటులో రానున్నాయి.  సౌర శక్తితో చల్లబడి ధరించేవారికి హాయిగా ఉండేలా రూపకల్పన చేశారు. ఈ తరహాలో అభివృద్ధి పర్చిన హెల్మెట్ సుదూర ప్రాంతాలైన దక్షిణ కొరియా, స్పెయిన్ మరియు మెక్సికో తదితర ప్రపంచ దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిని కనబర్చుతున్నారు. ఖతార్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన డెలివరీ & లెగసీ అత్యున్నత కమిటీ మరియు ఆస్పైర్ జోన్  ద్వారా అభివృద్ధి పేర్చిన ఈ హెల్మెట్ ధరించితే నిర్మాణ కార్మికుల చర్మం యొక్క ఉష్ణోగ్రతని పది డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది. ఇటువంటి సాంకేతికకు ప్రపంచవ్యాప్త గిరాకీ ఉంది. ఈ తరహా టెక్నాలజీ అందరకి అవసరం కానుంది.  లేనందున, ఒక ప్రపంచ డిమాండ్ ఉంది. వేడి వాతావరణములో పనిచేసే కార్మికుల భద్రతని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. కతర్ లో  పరిశోధనలు అవసరాలు తీరిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో ఆయా అవసరాలను తీర్చే విధంగా యోచిస్తున్నట్లు  కతర్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com