హమాద్‌లో నలుగురి అరెస్ట్
- March 14, 2017
రహదారిపై తలెత్తిన వివాదం కారణంగా ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు బహ్రెయినీ వ్యక్తులు గాయపడ్డారు. ఆసియాకి చెందిన కొందరు వ్యక్తులతో వీరికి వివాదం తలెత్తింది. బహ్రెయినీ వ్యక్తుల్ని ఆసియాకి చెందిన వ్యక్తులు ఐరన్ రాడ్స్‌తో కొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సౌక్ వకిఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన నలుగురు ఆసియా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బహ్రెయినీ వ్యక్తులు తమను దూషించారని విచారణ సందర్బంగా నిందితులు ఆరోపించినట్లుగా తెలియవస్తోంది. విచారణ నిమిత్తం ఏడు రోజులపాటు నిందితుల్ని అదుపులో ఉంచుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇంకో ఘటనలో బహ్రెయినీ యువకుడొకరు, మరో వ్యక్తిపై దాడికి దిగాడు. ఇద్దరూ తమ తమ వాహనాల్ని రోడ్డుపై నడుపుతుండగా తలెత్తిన వివాదమే ఈ ఘటనకు కారణం. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం ఒకరితో ఒకరు గట్టిగా కొట్లాటకు దిగారని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







