ఒమనీ, ఇండియన్‌ సంస్థల సమావేశం

- March 14, 2017 , by Maagulf
ఒమనీ, ఇండియన్‌ సంస్థల సమావేశం

మస్కట్‌: మస్కట్‌లో ఇండియన్‌ ఎంబసీ, బిజినెస్‌ టు బిజినెస్‌ మీటింగ్‌ని ఇండియన్‌ మరియు ఒమనీ కంపెనీల కోసం నిర్వహించింది. ఇండియన్‌ ఎంబసీ పరిసరాల్లో ఈ మీటింగ్‌ జరిగింది. మినిస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ డాక్టర్‌ అలీ బిన్‌ మసూద్‌ బిన్‌ అలీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ మీటింగ్‌ ద్వారా బిజినెస్‌ టై అప్స్‌కి అవకాశం కల్పించారు. ఇరు దేశాలకు చెందిన కంపెనీలు ఈ రెండు దేశాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకునే విషయమై చర్చలు జరిగాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కి), ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఐఇఓ) 'ఇండియన్‌ పెవిలియన్‌'ని ఏర్పాటు చేసి, భారతీయ కంపెనీలకు వేదికను నిర్వహించాయి. బిల్డింగ్‌ మెటీరియల్స్‌, కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌, సిరామిక్స్‌ అండ్‌ టైల్స్‌, ఉడ్‌ మెషినరీ, ఇంటీరియర్‌ డిజైన్‌, స్టోన్స్‌ అండ్‌ మార్బుల్స్‌, ల్యాండ్‌ స్కేప్‌ డిజైనింగ్‌, సెమీ ప్రెసియస్‌ జెమ్‌స్టోన్‌, పెయింట్స్‌ అండ్‌ కెమికల్స్‌, కోయిర్‌ ప్రోడక్ట్స్‌, కాంక్రీట్‌ అండ్‌ సిమెంట్‌, ఫుట్‌వేర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎక్విప్‌మెంట్‌, లెదర్‌ గూడ్స్‌, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, హ్యాండ్‌ టూల్స్‌కి సంబంధించిన సంస్థలు ఈ ఈవెంట్‌లో పాలుపంచుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com