తీవ్రవాదులు పాఠశాలలకు వెళ్ళే రోడ్లను మూసివేశారు

- March 15, 2017 , by Maagulf
తీవ్రవాదులు పాఠశాలలకు వెళ్ళే రోడ్లను మూసివేశారు

మనామా: చదువులను చట్టబండలు చేద్దామనేమో బహుశా తీవ్రవాదులు పాఠశాలలకు వెళ్ళే పలు రోడ్లను మూసివేశారు. ఈ తరహా చర్యలతో తీవ్రవాదులు ప్రభుత్వ పాఠశాలలను గత రెండు రోజులుగా రోడ్ల మీదుగా  పిల్లలను బడికి వెళ్లనీయకుండా నిరోధిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లనీయకుండా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అడ్డుకునేందుకు తీవ్రవాదులు ప్రయత్నం చేసి విఫలమయ్యాయరని విద్య మంత్రిత్వ శాఖ ఈ వార్తను నిర్ధారించింది. ఇటువంటి క్లిష్ట  సమయంలోను 94 శాతం మంది  ఉపాధ్యాయులు  మరియు విద్యార్ధుల శాతం మంగళవారం పాఠశాలకు హాజరయ్యారని విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చర్యలతో  రోడ్లను మూసివేయడం ద్వారా కింగ్డమ్ విద్యా ప్రక్రియ స్ధంబనకు గురిచేయాలనే బరి తెగించి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గత కొన్ని రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాలలకు చేరుకొనే మార్గాలను వారు చెక్క పలకలతో, చెత్తడబ్బాలు, ఇనుము రాడ్లతో మరియు బండ రాళ్ళుని  ఉపయోగించి ఆయా రోడ్లను మూసివేశారు. పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ అల్ ఖమీస్ మాట్లాడుతూ, బాలుర ప్రాథమిక స్కూల్ మోలోటోవ్ దాడులు తీవ్రవాదులు చేసినట్లు వెల్లడించారు.గత ఆరు సంవత్సరాల కాలంలో  విద్యా సంస్థలపై 524 దాడులను తీవ్రవాదులు చేసినట్లు ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com