ట్రావెల్ అలవెన్స్ కోసం ఫర్జరీ
- March 15, 2017
ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు, ట్రావెల్ అలవెన్స్ కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను రూపొందించింది. తన భర్త నుంచి విడిపోయినట్లుగా, తాను ఒంటరిగా ఉంటున్నట్లుగా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసిందామె. తద్వారా సింగిల్ మదర్స్కి దక్కే ట్రావెల్ అలవెన్స్ దక్కించుకోవాలని ఆమె ప్లాన్ చేసింది. అబుదాబీలోని పబ్లిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళ, నాలుగు అధికారిక డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్లు అబుదాబీ క్రిమినల్ కోర్ట్ నిర్ధారించింది. ఈ ఫోర్జరీ ప్రక్రియలో ఆమెతోపాటు ఐదుగురు కొలీగ్స్ కూడా నిందితులుగా తేల్చింది న్యాయస్థానం. ఫోర్జరీతోపాటు, పబ్లిక్ ఫండ్స్ని దుర్వినియోగం చేసిన కేసులో ఆమెపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. అయితే ఈ కేసులో మిగతా నిందితులు, అసలు నిందితురాలి వివాహ స్థితిపై తమకెలాంటి సమాచారం తెలియదని చెప్పారు. ఈ కేసు విచారణ మార్చ్ 22కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









