సూపర్ స్టార్ సరసన బాలీవుడ్ భామ దీపికా

- March 16, 2017 , by Maagulf
సూపర్ స్టార్ సరసన బాలీవుడ్ భామ దీపికా

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0 చిత్రం చేస్తున్న తలైవా తర్వాత మరోసారి పా.రంజిత్ తో కలిసి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ మూవీ ఉంటుందని సమాచారం. ధనుష్ నిర్మించనున్న ఈ చిత్రంలో కథానాయికగా విద్యా బాలన్ ని తీసుకున్నారని వార్తలు వచ్చినప్పటికి ఇప్పుడు ఆ వార్తలని ఖండిస్తూ మరి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొచ్చాడియాన్ చిత్రంలో రజినీ సరసన కథానాయికగా నటించిన పొడుగు కాళ్ళ సుందరి దీపిక పదుకొణే ని రంజిత్ ప్రాజెక్టుకి తీసుకున్నారని చెబుతున్నారు.
దీపిక ప్రస్తుతం పద్మావతి ప్రాజెక్టుతో బిజీగా ఉండగా, ఈ మూవీ తర్వాత రజినీకాంత్ సినిమాలో నటించనుందని అంటున్నారు. రంజిత్ డైరెక్షన్ లో రజనీ చేసే ఈ పిక్చర్ కు ఎంచుకున్న కథ వెరైటీగా ఉందని .. రజనీని రంజిత్ మళ్లీ కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com