51 మోటర్ బైక్స్ స్వాధీనం
- March 18, 2017
రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ క్యాంపెయిన్‌లో భాగంగా 51 మోటార్ బైక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజున ఈ వాహనాల స్వాధీనం జరిగింది. నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా వీటిని స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అలి సయీద్ అల్ అల్కీమ్ మాట్లాడుతూ, అతి వేగంతో అర్థరాత్రి వేళ ప్రమాదకర రీతిలో నడుపుతున్న వాహనాలే సీజ్ చేసినవాటిలో అధికమని చెప్పారు. నివాసితులకు ఇబ్బంది కలిగించేలా వాహనాల్ని రఫ్‌గా నడిపేవారిపైనా కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ట్రాఫిక్ స్టాఫ్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్ ఏరియాస్‌లో పర్యటించి, పబ్లిక్‌కి అవగాహన కల్పిస్తారనీ, ప్రమాదాల్ని నివారించడంలో వారి భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పారాయన. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి జరీమానాలతోపాటు, కఠిన చర్యలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘనుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు కల్నల్ అల్కీమ్. సీజ్ చేసిన వాహనాలను జరీమానా చెల్లించి నెల రోజుల్లోగా సొంతదారులు తీసుకోవాలని, లేని పక్షంలో అవి వారెప్పటికీ పొందలేరని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







