సౌదీలో లేబర్ ఉల్లంఘనుల కోసం 90 రోజుల అమ్నెస్టీ
- March 20, 2017
ఇంటీరియర్ మినిస్ట్రీ, 'ఎ నేషన్ వితౌట్ వయొలేషన్స్' పేరుతో క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. 90 రోజుల్లో ఉల్లంఘనలు, దేశం విడిచి వెళ్ళేందుకు ఈ అమ్నెస్టీ అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి పెనాల్టీలూ విధించకుండా ఈ అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు ఈ అమ్నెస్టీని మంచి అవకాశంగా తీసుకోవాలని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ చెప్పారు. మార్చ్ 29 నుంచి ఈ అమ్నెస్టీ అమల్లోకి వస్తుంది. దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా అన్ని విభాగాలకూ తగు సూచనలు చేశారు క్రౌన్ ప్రిన్స్. ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిథి మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, 19 ప్రభుత్వ శాఖలు ఈ క్యాంపెయిన్‌ని చేపట్టనున్నట్లు వివరించారు. హజ్ లేదా ఉమ్రా విజిట్ కోసం వచ్చి, ఎక్కువ కాలం ఇక్కడే అక్రమంగా నివసిస్తున్నవారు కూడా ఈ అమ్నెస్టీకి అర్హులని ఆయన తెలిపారు. అమ్నెస్టీ పీరియడ్‌ని వినియోగించుకోని ఉల్లంఘనులపై అమ్నెస్టీ ముగిసిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







