వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని పిటిషన్

- March 21, 2017 , by Maagulf
వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలని పిటిషన్

ఏదయినా సమస్య వస్తే.. దానికి పరిష్కారమార్గాలు వెతకాలి కానీ... సమస్య మీ వల్లే వచ్చిందంటూ ఎదుటి వారిని తిడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం. పరస్సర ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటూ సమస్య ఇంకా జఠిలం అవుతుందే కానీ.. ఏమాత్రం తగ్గిపోదు. మరి ఈ సాధారణ సూత్రం తెలిసో తెలియకో  కానీ  కువైట్ న్యాయవాది మహ్మద్ అల్ అన్సారీ వింత వాదన మొదలుపెట్టాడు. కువైట్‌లో ట్రాఫిక్ మరీ ఎక్కువయిపోతోందనీ, దీనివల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయాడు. అంతవరకూ అయితే బాగుండేది కానీ... కువైట్ పౌరుల ట్రాఫిక్ బాధలు తీర్చేందుకు దేశంలోని వలసదారుల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయాలంటూ కోర్టుకెక్కాడు. విదేశీయులెవరూ కువైట్ రోడ్లపై వాహనాలు నడిపేందుకు వీల్లేకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశాడు. 
 
2013 లెక్కల ప్రకారం కువైట్‌లో 31 లక్షల మంది వలసదారులు, విదేశీయులు ఉంటే.. 13 లక్షల మంది దేశ పౌరులు ఉన్నారు. వలసదారుల్లో ఎక్కువగా ఆసియన్ దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. వీరంతా కూలిపనులు, ప్రైవేటు కంపెనీల్లో పలు స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న విదేశీయుల వల్లే దేశంలో వాహనాలు ఎక్కువయ్యాయనీ, వీళ్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసి, కొత్తవి జారీ చేయకుండా చేసి.. దేశ పౌరుల ట్రాఫిక్ రద్దీ బాధలు తీర్చాలంటూ కోర్టుకు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి వలసదారులకు కూడా వాహనాలను నడిపే అవకాశాల గురించి పరిశీలించాలని కోరాడు. మరి ఈయనగారి ప్రతిపాదనను కోర్టు, ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటాయో లేదో.. వేచిచూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com