అడుగుపెట్టిన బంగ్లా ఉగ్రవాదులు భారత దేశంలోకి

- March 21, 2017 , by Maagulf
అడుగుపెట్టిన బంగ్లా ఉగ్రవాదులు భారత దేశంలోకి

తమ దేశం నుంచి పలువురు ఉగ్రవాదులు భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక సమర్పించింది.  గతంలో కంటే మూడింతలు అదనంగా ఉగ్రవాదులు చొరబడినట్లు పేర్కొంది.  హర్కత్ ఉల్ జిహాది అల్ ఇస్లామి, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్‌కి చెందిన దాదాపు 2,010 ఉగ్రవాదులు 2016లో బంగ్లా సరిహద్దును దాటి పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినట్లు బంగ్లా అధికారులు ఒక నివేదికలో పేర్కొన్నారు.  బెంగాల్ సరిహద్దు నుంచి 720 మంది, 1,290 మంది మాత్రం త్రిపుర, అసోం రాష్ట్రాల సరిహద్దులు దాటి ప్రవేశించినట్లు తెలిపింది.  బంగ్లా ప్రభుత్వం ఇచ్చిన నివేదికపట్ల ఇప్పటికే బెంగాల్ తర్జనభర్జనలు పడుతుండగా త్రిపుర, అసోం రాష్ట్రాలు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com