గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో రాహుల్ గాంధీ

- March 21, 2017 , by Maagulf
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో రాహుల్ గాంధీ

AICC ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కబోతున్నారు. సరికొత్త వరల్డ్ రికార్డు స్థాపించబోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల షాక్‌లో ఉన్న  రాహుల్ గిన్నిస్ రికార్డు చేయమేంటని డౌట్‌ వస్తోందా. ఈ వరుస ఓటమిలే ఆయనను రికార్డు పుస్తకంలోకి ఎక్కించబోతున్నాయి. కాకపోతే.. ఆయన తరఫున ఈ రికార్డు కోసం మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అప్లై చేశాడు. రాహుల్‌ను వరల్డ్ రికార్డ్‌ హోల్డర్‌గా నిలిపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

రాహుల్ గాంధీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ మఠాషే అంటాయి ప్రత్యర్థి పార్టీలు. అభ్యర్థుల ఓటమి ఖాయం అంటాయి. ఇప్పుడు రాహుల్ దెబ్బతో ఓడిపోయిన వారందరి లెక్కా తీశాడు ఎంపీకి చెందిన విశాల్ దివాన్. రాహుల్ గాంధీ మొత్తం 27 ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు లిస్ట్ రెడీ చేశాడు. దీన్ని ఆయన ఘనతగా భావించి..  గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించాలని వారికి ఒక లెటర్ రాశాడు. అందరికంటే ఎక్కువ ఎన్నికలు ఓడిన వ్యక్తిగా రాహుల్  రికార్డును గుర్తించాలని విశాల్ కోరుతున్నాడు. 2012 నుంచి 2017 వరకూ రాహుల్ ఎక్కడెక్కడ, ఎవరెవరికి  ప్రచారానికి వెళ్లాడో ఆ రికార్డులన్నీ సేకరించాడు విశాల్. లెటర్ తోపాటూ వీటన్నింటినీ జోడించాడు. గిన్నిస్ వారికి లెటర్ రాయడమే కాదు.. ఈ రికార్డు కోసం ఎన్ రోల్ మెంట్ ఫీజ్ కూడా తనే కట్టాడు. ఇతడి లెటర్ ను వెంటనే యాక్సెప్ట్ చేసిన గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులు.. అప్లికేషన్ అప్రూవ్ అయ్యిందా లేదా ఇంకా సమాచారం అందలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com