యూఏఈలో భారీ వర్షం - ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
- March 21, 2017
థండర్ రెయిన్స్ ఫుజాయిరా, షార్జా, అల్ అయిన్ తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎక్కువగానూ, కొన్ని చోట్ల ఓ మోస్తరుగానూ కురిశాయి. నేడు కూడా థండర్ రెయిన్స్ ఉంటాయని మెటియరాలజీ అండ్ సెస్మాలజీ నేషనల్ సెంటర్ పేర్కొంది. ఆకాశం మేఘావృతమయి ఉంటుందనీ, వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పులుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతోంది. 1000 మీటర్లకంటే తక్కువగా విజిబిలిటీ ఉంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. బలమైన గాలులు, దుమ్ముతో కూడిన వాతావరణం చోటుచేసుకుంటుంది. ఈ వారంలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. వాహనదారులు వర్షాల పట్ల, దుమ్ముతో కూడిన గాలి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. బుధవారం వాతావరణం మేఘాలతో నిండి ఉండనుంది. సముద్రం కొంతమేర రఫ్‌గా ఉండొచ్చు. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ ఓ మోస్తరు రఫ్‌గా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







