రైలు రాకపోకల్ని గూగుల్ మ్యాప్ లో చూసేయండి..!!

- September 26, 2015 , by Maagulf
రైలు రాకపోకల్ని గూగుల్ మ్యాప్ లో చూసేయండి..!!

దేశ వ్యాప్తంగా నడుస్తున్న రైళ్ల ప్రస్తుత స్థితిని ఇకనుంచి గూగుల్‌ మ్యాప్‌పై చూడొచ్చు. దీని కోసం కొత్త కంపెనీ (స్టార్ట్‌ఆప్‌) రైల్‌యాత్రి.ఇన్‌ ఓ వేదికను సిద్ధంచేసింది. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) ఆధారిత అప్లికేషన్‌ (యాప్‌) రూపొందించింది. ''రైల్‌ రాడార్‌ జీపీఎస్‌'' పేరిట తయారుచేసిన ఈ యాప్‌ ద్వారా రైలు ప్రస్తుతం ఎక్కడుందో గూగుల్‌ మ్యాప్‌పై చూడొచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రైలు సమయం, ఆలస్యం తదితర విషయాలు కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది. దీని కోసం స్మార్ట్‌ లొకేషన్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. రైలులో ప్రయాణిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల స్థాన సంకేతాలను విశ్లేషించడం ద్వారా ప్రస్తుత రైలు స్థితిని చెప్పగలమని పేర్కొంది. రైలు సమాచారం అనంతరం ఎక్కువ మంది ప్రయాణికులు రైలు స్థితిని కొరుతున్నట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com