'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకొని....గుర్తు తెలియని ఓ మహిళ ఆత్మహత్య

- March 23, 2017 , by Maagulf
'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకొని....గుర్తు తెలియని ఓ  మహిళ ఆత్మహత్య

స్థానిక కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ వద్ద గుర్తు తెలియని మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం ఆ మహిళ మృతదేహంను తమ సిబ్బంది ద్వారా కనుగొనబడిందని సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆ మహిళకు ఏ కష్టం వచ్చిందేమో ఇలా అర్ధాంతరంగా తన ప్రాణాలు తీసుకొంది. ఉదయం 8 గంటల సమయంలో మెట్రో స్టేషన్ నిష్క్రమణ ద్వారం సమీపంలో ఏర్పాటు చేయబడిన ఒక ఇనుప గ్రిల్ కు ఉరి వేసుకొన్న స్థితిలో ఆ మహిళ మృతదేహం కనుగొనబడిందని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ దళానికి చెందిన ఒక ప్రతినిధి తెలిపారు. ఆమె ధరించిన 'దుపట్టా' నే ఉరితాడుగా మలచుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నివేశ స్థలంలో ఉందని ఆ అధికారి తెలిపారు. మరణించిన మహిళ పేరు, చిరునామా ఇప్పటివరకు  తెలియదని " నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా ఆమె దూరంగా వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే ఆధారం లేకుండా ఆ మహిళ జాగ్రత్తలు తీసుకోండని ఆ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com