ఖతార్‌లో ప్రియం కానున్న ఆల్కహాల్
- March 23, 2017
ఖతార్‌లో మద్యం ప్రియులు కోటా ప్రకారమే మద్యం కొనుగోళ్ళు చేయాల్సి ఉంటుంది. అలాగే అమ్మకందార్లు కూడా పరిమిత సంఖ్యలోనే మద్యాన్ని అమ్మకాల కోసం సిద్ధం చేయాల్సి ఉంటుంది. మద్యం ప్రియులు వారి జీతానికి సంబంధించిన లెక్కలకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసేందుకు కోటా విధించారు. రమదాన్ సందర్భంగా ఈ కోటాని మూడింతలు చేయనున్నారు. అలాగే మద్యం అమ్మకాలపై పన్నుని భారీగా విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. జిసిసి దేశాలు సంయుక్తంగా ఈ ట్యాక్స్‌పై ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇంకో వైపున జిసిసి దేశాలు సంయుక్తంగా అమలు చేయనున్న వ్యాట్ కూడా మద్యం ప్రియులకు చేదు అనుభవాన్ని మిగల్చనుంది. 2018 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యాట్ ద్వారా లభించే ఆదాయాన్ని వివిధ రంగాలకు మళ్ళిస్తారు. అయితే ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, సోషల్ సర్వీస్ వంటి రంగాలకు ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







