దుబాయ్ లో 'కాటమరాయుడు' రిలీజ్‌ మేనియా

దుబాయ్ అల్ కూజ్ లోని బాలీవుడ్ సినిమా హాల్ లో 'కాటమరాయుడు' సినిమా రిలీజ్‌ సందర్భంగా ప్రీమియర్‌ షో వేయడం జరిగింది. పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ప్రీమియర్‌ షోని తిలకించేందుకు విచ్చేశారు. ప్రీమియర్‌ షో సందర్భంగా అభిమానులు కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రసాద్‌ పెద్దిశెట్టి, రవి చల్లా, దుర్గారావ్‌ (దుబాయ్‌ పవనిజంఫౌండర్స్‌), అలాగే సింగిరి రవికుమార్‌, కటారు సుదర్శన్‌, తులసి ప్రసాద్‌ ఎరికి, రాజమండ్రి మూర్తి తదితరులు తమ అభిమాన హీరో సినిమా రిలీజ్‌ సందర్బంగా సినిమా విజయవంతమవుతుందనే దీమా వ్యక్తం చేశారు.

Back to Top