సాయం కోసం ఇండియన్‌ వర్కర్స్‌ ఎదురుచూపులు

- March 25, 2017 , by Maagulf
సాయం కోసం ఇండియన్‌ వర్కర్స్‌ ఎదురుచూపులు

మనామా: 500 మందికి పైగా భారతదేశానికి చెందిన కార్మికులు, మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ - ఇండియా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బహ్రెయిన్‌లోని పలు కంపెనీల్లో పనిచేస్తున్న వీరు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు సరిగ్గా లేక, పనిచేసినా జీతాలు రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 500 మందికి పైగా కార్మికులకు గత కొన్ని నెలలుగా జీతాలు రావడంలేదు. విదేశాంగ మంత్రి సుష్మా సష్మా స్వరాజ్‌ దృష్టికి బాధిత కార్మికుల వెతలు వెళ్ళాయి. దాంతో ఆమె, మనామాలోని ఇండియన్‌ ఎంబసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకో వైపున తెలంగాణ ప్రభుత్వం కూడా సౌదీ అరేబియాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 29 మంది ఇండియన్‌ వర్కర్స్‌పై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కి వినతి పత్రం అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com