225 మంది భారతీయులు పాక్ చెరలోకి
- March 26, 2017
గుజరాత్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని జఖావు తీరం వద్ద 100 మందికి పైగా భారత జాలర్లను పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్టు మత్స్యకారుల సంఘం వెల్లడించింది. జాలర్లతో పాటు మరో 18 పడవలను కూడా పాకిస్తాన్ తీర ప్రాంత గస్తీ దళం (పీఎంఎస్ఏ) పట్టుకెళ్లినట్టు వెల్లడించింది. పీఎంఎస్ఏ నుంచి తప్పించుకుని వచ్చిన జాలర్ల ద్వారా తమకీ విషయం తెలిసినట్టు నేషనల్ ఫిష్వర్కర్స్ ఫోరమ్ (ఎన్ఎఫ్ఎఫ్) సెక్రటరీ మనీశ్ లోథరి పేర్కొన్నారు. మొత్తం ఎంతమంది భారతీయులను అదుపులోకి తీసుకున్నది వెల్లడించాలంటూ పాకిస్తాన్ ఏజెన్సీలతో ఎన్ఎఫ్ఎఫ్ సంప్రదింపులు జరుపుతోంది. కాగా ఇదే నెలలో ఇంతకుముందు పాకిస్తాన్ భారత్‌కి చెందిన 115 మంది జాలర్లతో పాటు 19 బోట్లను కూడా అదుపులోకి తీసుకుంది.
దీంతో ఈ నెలలో మొత్తం 225 మందిని పాకిస్తాన్ చెరబట్టుకుని తీసుకెళ్లినట్టు లోథరి చెబుతున్నారు. గత శుక్రవారం ఇదే ప్రాంతంలో భారత దళాలు తొమ్మిదిమంది పాకిస్తానీయులతో పాటు ఓ పడవను స్వాధీనం చేసుకుంది. గతనెలలో కూడా మరో నలుగురు జాలర్లను అరెస్టు చేసింది. దీనికి ప్రతిగానే పాక్ భారత జాలర్లను నిర్బంధించినట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







