ప్రిన్స్‌ ఖలీఫాకు సౌదీ నాయకత్వం కృతజ్ఞతలు

- September 28, 2015 , by Maagulf
ప్రిన్స్‌ ఖలీఫాకు సౌదీ నాయకత్వం కృతజ్ఞతలు

ప్రధాని ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ నుంచి కృతజ్ఞతలు అందుకున్నారు. మక్కా యొక్క గ్రాండ్‌ మాస్క్‌లో క్రేన్‌ కూలిన ఘటనలో బాధితులకు సంతాపం తెలపడంతోపాటు, తమకు అండగా నిలిచినందుకు అబ్దుల్‌ అజీజ్‌, ప్రిన్స్‌ ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్స్‌ ఖలీఫా ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలనీ, తమ పట్ల సోదర భావం కొనసాగించాలని ఆకాంక్షించారు అబ్దుల్‌ అజీజ్‌. సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌, డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్‌ మహమ్మద్‌ నయిఫ్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ మరియు డిప్యూటీ క్రౌన్‌ ప్రిన్స్‌, సెకెండ్‌ డిప్యూటీ ప్రీమియర్‌ మరియు డిఫెన్స్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ కూడా ప్రిన్స్‌ ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపినవారిలో ఉన్నారు. 


--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com