మీరు నిరుద్యోగిగా ఉన్నారా ? ఈ దుబాయ్ రెస్టారెంట్ వద్ద ఉచిత భోజనం
- March 29, 2017
దుబాయ్:రెస్టారెంట్ యజమాని తన జట్టు అదనపు ఆహార ప్యాక్ చేసి పేదవారికి పంపిణీ చేస్తామని చెప్పారు.నిరుద్యోగ జీవిత కష్టాలను తగ్గించేందుకు ఓ రెస్టారెంట్ వారికి మద్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించి ఏడాదిగా దాన్ని అమలుచేస్తోంది. దుబాయిలోని వఙ్కమన్ ఒక చైనీస్ రెస్టారెంట్. నిరుద్యోగులకు ఉచిత మద్యాహ్న భోజనం అనే బోర్డు పెట్టి..అందరి మన్ననలు పొందుతోంది.వారంలో ఏ రోజయినా సరే నిరుద్యోగులు మద్యాహ్న సమయంలో వచ్చి అన్నం, చపాతీ, నూడిల్స్ వంటివాటిని ఆహారంగా స్వీకరించవచ్చు.ఏమాత్రం డబ్బు కట్టకుండా బయటకు వెళ్లవచ్చు. తాము ఏడాదిగా ఈ విధమైన సర్వీసును అందిస్తున్నామని రెస్టారెంట్ యజమాని, డిల్లాన్ దర్యాణాని తెలిపారు. రోజు కనీసం 10 నుండి 15 బాక్సులను అందించడానికి తగినంత అవకాశం మాకు ఉంది మేము చిన్న పెట్టెల్లో ఆహారాన్ని సర్ది సమీపంలోని నిర్మాణం సైట్లకు పంపిస్తాం...పేదలు నిరుద్యోగులు వాటిని సంతోషంగా స్వీకరిస్తున్నారు. నిరుద్యోగులకు ఆహరం అందివ్వాలని తనకు ఇష్టం." తమకు ఉద్యోగం లభించిందని ఆనందంతో..ఇక్కడ భోజనం తిన్న వాళ్లు చెబుతుంటారనీ, కొంతమందయితే మొదటి నెల జీతం వచ్చాక కొంత డబ్బు కూడా ఇస్తుంటారని ఆయన వివరించారు. తాము డబ్బును కోరలేదనీ, వాళ్లు వచ్చి తమకు చెప్పాలని కూడా ఆశించడం లేదని, అయినా వారి సంతృప్తి కోసం తీసుకుంటుంటా మన్నారు. భవిష్యత్తులో ఉద్యోగం వస్తే.. ఎప్పుడైనా ఏ అనాథ శరణాలయానికో, స్వచ్ఛంద సంస్థకో దానం ఇవ్వడం మర్చిపోవద్దని మాత్రం ఆ రెస్టారెంట్ మేనేజర్ చెబుతున్నారు. మొత్తానికి నిరుద్యోగులకు అక్షయ పాత్రలా మారిన ఆ రెస్టారెంట్‌కు లాభాలు బాగానే ఉన్నాయి. ఈ సర్వీసును ఇంకా కొనసాగిస్తామంటూ ఆ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







