ఏపీ తెలంగాణ లో 1771 తపాలాశాఖ ఉద్యోగాలు

- March 30, 2017 , by Maagulf
ఏపీ తెలంగాణ లో 1771 తపాలాశాఖ ఉద్యోగాలు

తెలుగు రాష్ట్రాల్లో 1771 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను పోస్టల్ శాఖ ప్రకటన విడుదల చేసింది.  ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ తపాల సర్కిళ్ళలో 1126, తెలంగాణా లోని వివిధ సర్కిళ్లలో 645 ఉన్నాయి.  
పోస్టు పేరు : గ్రామీణ డాక్ సేవక్ (ప్యాకర్/బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం/ఎండీ/ఎంసీ)
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది.  ఉన్నత విద్య చదివినప్పటికీ దానికి ప్రత్యేక మార్కులేమీ ఉండవు.  సైకిల్ వచ్చి ఉండాలి.  గుర్తింపు పొందిన సంస్థలో కంప్యూటర్ కోర్సు చదివి ఉండాలి.  అభ్యర్ధులు ఏ బ్రాంచ్ పరిధిలో పోస్టుకు ఎంపికవుతారో ఆ బ్రాంచ్ పరిధిలోని గ్రామంలోనే నెల వ్యవధిలోపు నివాసం ఏర్పాడు చేసుకోవాలి. 
వయోపరిమితి : 18-40 ఏళ్ళ లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల శాతాన్ని అనుసరించి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 19, 2017
ఫూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com