బుర్జ్ అల్ అరబ్ ఈత పోటీల ద్వారా 160,000 దిర్హాములు సేకరణ
- March 31, 2017
దుబాయ్ తీరంలో సహజమైన జలాల్లో1600 మీటర్ల ఈత 30 డిగ్రీల పరిధిలో వందలాది మంది ఈతగాళ్ళు వారి ఈత దుస్తులు మరియు ఎరుపు ఈత టోపీలు ధరించి ఈ ప్రదేశంలో కలుసుకొన్నారు. అరేబియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఉదయం 8 గంటలకు ఈల ఊదే సమయానికి బుర్జ్ అల్ అరబ్ వద్ద అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రక్రియల నమోదు మరియు ఈవెంట్ స్పాన్సర్షిప్ ద్వారా సేకరించిన 158,750 దిరంల మొత్తాన్ని జాలీలహ్ ఫౌండేషన్ కు ఇస్తారు. లేత నులివెచ్చని ఎండ మరియు చల్లని నీటిలో 450 మంది ఈతగాళ్ళు, వివిధ రకాల వయసుల వారు సముద్రతీరం అంతటా 1600 మీటర్ల రేసులో పాల్గోవడం ఎంతో సందడి మిగిల్చింది. బుర్జ్ అల్ అరబ్ లో జరిగిన నేటి గ్లోబల్ స్విమ్ సిరీస్, ఓపెన్ వాటర్ ఈత పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల నుంచి ఈ పోటీలలో ఈతగాళ్ళు ఈదడం ప్రపంచంలోనే అతిపెద్ద ఈతపోటీల కార్యక్రమంగా నమోదైంది.1,600 మీటర్ల మరియు 800 మీటర్ల పోటీలు ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ రకమైన ఈత పోటీలలో ఇది పదమూడవ అధ్యాయం. ఈ కార్యక్రమాన్ని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మరియు బుర్జ్ అల్ అరబ్ షేర్ దుబాయ్ హోల్డింగ్ నిర్వహిస్తారు. ఊబకాయం పై పరిశోధనలో భాగంగా అల్ జాలీలహ్ ఫౌండేషన్ నిధి దుబాయ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ద్వారా 158,750 దిర్హామ్ ఒక మొత్తం కార్యక్రమం మద్దతు ద్వారా , నమోదు రుసుము మరియు స్పాన్సర్ల నుండి ఒక సహకారం ద్వారా ఈ డబ్బు మొత్తం సమీకరించింది.30 నిమిషాల కంటే తక్కువ సమయంలో వందల మంది ముగింపు రేఖ తిరిగి ఈదుకుంటూ వచ్చారు మరియు ఉత్సాహభరిత గుంపునాకు స్వాగతం పలికారు. క్రిస్టోఫర్ బ్రయాన్ అనే ఈతగాడు 23 నిమిషాల 41 సెకండ్ల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకొన్నాడు. బుర్జ్ అల్ అరబ్ ఈతపోటీలలో విజేతగా నిలిచేడు. ఈ పోటీలలో గెలిచినా పురుష మరియు మహిళా విభాగంలో విజేతల జాబితా ఈ దిగువ ఇవ్వబడింది:
పురుషుల విభాగంలో విజేతలు (1600 మీటర్లు)
1. క్రిస్టోఫర్ బ్రయాన్
2. థామస్ డల్గార్నో
3. ఒమర్ అల్ హమ్మది
మహిళల విభాగంలో విజేతలు (1600 మీటర్లు)
1.కేళేఇఘ్ డాసన్
2.యాస్మిన్ అలమద్దినే
3. జాస్మిన్ డీజఫ్ .
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







