రద్దయిన నోట్ల డిపాజిట్ రూ.2 లక్షలు దాటితే కచ్చితంగా ఐటీ రిటర్న్
- March 31, 2017
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు రూ.2 లక్షలకు మించి బ్యాంకుల్లో జమ చేసిన వారు విధిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని శుక్రవారం వెల్లడించింది. గతంలో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, దాని గురించి ఆదాయపన్ను శాఖ ఎలాంటి విచారణ నిర్వహించదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. రూ.2 లక్షలకు మించి బ్యాంకుల్లో జమ చేసి ఉంటే ఆ మొత్తం వివరాలు ఇప్పుడు తప్పనిసరిగా వెల్లడించాల్సిందే.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఒక పేజీ ఐటీ రిటర్న్ ఫామ్ కింది భాగంలో దీని కోసం ఒక కాలమ్ కేటాయించారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో జమ చేసిన రద్దయిన పాత నోట్లు రూ.2 లక్షలకు మించిన వివరాలు ఇందులో పొందుపరచాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇలా మాటమార్చడంతో ఇప్పుడు ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకునేందుకు కొంతమంది తమ ఖాతాల ద్వారా ఇతరులకు సహకరించారు కూడా. ఇప్పుడు రూ.2 లక్షలకు మించి జమచేసి ఉంటే లెక్క చెప్పాల్సిందేనని కేంద్రం ప్రకటించడంతో వీరి గుండెల్లో రాయి పడినట్లయింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







