మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నఅబుధాబి యువరాజు

- April 02, 2017 , by Maagulf
మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నఅబుధాబి యువరాజు

అబుధాబి యువరాజు మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.యు.ఏ.ఈలోని ఫుజైరః అనే ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్లో నివసిస్తున్న కుటుంబంపై ఒక వ్యక్తి  హత్య ప్రయత్నం చేశాడు. ఆ దాడిలో ఇంటి యజమానురాలు అక్కడిక్కడే చనిపోయింది. వారింట్లో పనిచేస్తున్నా పనిమనిషితో సహ పిల్లలద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్మార్గం నుంచి గాయాలతో బయటపడ్డ పిల్లలిద్దరిని, పనిమనిషిని రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పరామర్శించారు. వారు షేక్ ఖలీఫా మెడికల్ సీటీ హస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను  సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో  రాజు సామాన్య బాధితులను పరామర్శించడం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సామాన్యుల పట్ల ఆయన చూపుతున్న ఆదరణను పలువురు కొనియాడారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com