వలసదారులకు లైసెన్స్‌ ఇవ్వొద్దన్న ఎంపీ

- April 03, 2017 , by Maagulf
వలసదారులకు లైసెన్స్‌ ఇవ్వొద్దన్న ఎంపీ

కువైటీ లా మేకర్‌ ఒకరు, వలసదారులకు ఏడాదిపాటు డ్రైవింగ్‌ లైసెన్సులు ఇవ్వరాదనే డిమాండ్‌ని గట్టిగా వినిపిస్తున్నారు. ఎంపీ సఫా అల్‌ హషీమ్‌ మాట్లాడుతూ, రహదార్లపై ప్రమాదాలు తగ్గడానికి, అలాగే ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడానికి ఇదొక్కటే మార్గం అని ఆమె తెలిపారు. స్వదేశం నుంచి లైసెన్స్‌ లేని వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్‌ లైసెన్స్‌ ఇవ్వరాదని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే కువైట్‌ లైసెన్స్‌ లేని వ్యక్తి సొంతంగా ఎలాంటి వాహనాన్నీ పొందే వీలు లేకుండా చేయాలని కూడా ప్రపోజల్‌ పెడుతున్నారామె.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com