14న విడుదల కానున్న'లంక'

- April 03, 2017 , by Maagulf
14న విడుదల కానున్న'లంక'

సీనియర్‌ నటి రాశి కీలక పాత్రలో రోలింగ్‌ రాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నామన దినేష్‌, నామన విష్ణు కుమార్‌లు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘లంక’. శ్రీముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. టెలీపతి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సినిమా విజయవంతం అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com