సిరియాలో రసాయనిక దాడి.. 58 మంది మృతి
- April 04, 2017
సిరియాలో రసాయనిక దాడి జరిగింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రసాయనిక దాడిలో సుమారు 58 మంది మృతి చెందారు.
ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. సిరియా దళాలు లేదా రష్యా జెట్ విమానాలు ఈ రసాయనిక దాడులకు పాల్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో 200 మంది ఈ దాడి ప్రభావానికి లోనయ్యారు.
తాము కెమికల్ వెపన్స్ వాడటం లేదని సిరియా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 2014 నుంచి 2015 మధ్య అసద్ సేనలు కనీసం మూడుసార్లు ఇలా రసాయనిక దాడులకు పాల్పడినట్లు ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
సల్ఫర్ ఏజెంట్ తో దాడి చేసి ఉంటారని, శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.
మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!







