శ్రియాభూపాల్‌కు ఎన్నారైతో పెళ్లి!

- April 05, 2017 , by Maagulf
శ్రియాభూపాల్‌కు ఎన్నారైతో  పెళ్లి!

హీరో అఖిల్ మాజీ ప్రేయసి శ్రియాభూపాల్ గురించి లేటెస్ట్ న్యూస్. ఓ ఎన్నారైని ఆమె మ్యారేజ్ చేసుకోనున్నట్లు అందులోని సారాంశం. అఖిల్‌తో మ్యారేజ్ డ్రాప్ కాగానే శ్రియా పేరెంట్స్ ఆమెకి ఓ ఎన్నారై సంబంధం చూశారని, సదరు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి శ్రియ కూడా ఓకే చెప్పేసిందట. వీలైతే శ్రియభూపాల్‌కి వచ్చేనెలలో మ్యారేజ్ జరగడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
బిజినెస్‌మేన్ జీవీకే మనవరాలు శ్రియాభూపాల్‌కు అక్కినేని వారసుడు అఖిల్‌కు ఇటీవల ఎంగేజ్‌మెంట్ జరిగింది. మ్యారేజ్ విషయంలో ఫారెన్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో తలెత్తిన విభేదాలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని రెండు ఫ్యామిలీలు ఖండించలేకపోవడంతో నిజమేనని అనుకున్నారు.
 
వీళ్లిద్దరిని కలపడానికి ఇరు ఫ్యామిలీలకు చెందిన సినీ ప్రముఖులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈలోగా ఎన్నారైని మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది శ్రియభూపాల్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com