ఆధార్ తప్పనిసరి ఇకపై విమానం ఎక్కాలంటే !
- April 06, 2017
ఇటీవల పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి, మొబైల్ నెంబర్లకు ఆధార్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటి తర్వాత విమానమెక్కడానికి ఇక ఆధార్ అవసరమని తెలుస్తోంది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ పోర్టులో ప్రయాణికుల కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ యాక్సస్ బ్లూప్రింట్ ను అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం టెక్ దిగ్గజం విప్రోను ఆదేశించిందని సమాచారం.
దీనికి సంబంధించిన రిపోర్టును విప్రో మే నెల మొదట్లో ప్రభుత్వం ముందుంచనుంది. విప్రో ఈ రిపోర్టును సమర్పించిన అనంతరం నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా దేశీయ విమానాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరి నుంచి ఎయిర్ పోర్టులో వేలిముద్రలు తీసుకోవడం ప్రారంభిస్తారు.
దీంతోపాటు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు ఆధార్ నెంబర్ ను ఇవ్వాల్సి ఉంటుందని ఏఏఐ చీఫ్ చెప్పారు. విమానమెక్కడానికి ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు ప్రయాణికుల దగ్గర్నుంచి టచ్ ప్యాడ్ లో వారి వేలిముద్రను తీసుకోనున్నారు. చెకిన్ ప్రాసెస్ లో భాగంగా లోపల కూడా ఇదే తరహా ప్రక్రియను చేపట్టనునున్నారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









