విశాఖలో 8న టీఎస్సార్‌ అవార్డుల ప్రదానం

- April 06, 2017 , by Maagulf
విశాఖలో 8న టీఎస్సార్‌ అవార్డుల ప్రదానం

టీఎస్సార్‌ ఫౌండేషన్‌ 2015-16కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. వివిధ సినిమాల్లో పలు కేటగిరిల ద్వారా ఎంపికైన 62 మంది విజేతలకు విశాఖలో ఈనెల 8న నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. అభిమానులతో పాటు ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని అవార్డులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన ఇవాళ హైదరాబాద్‌లో వివరించారు. జ్యూరీ సభ్యులుగా జయసుధ, జీవిత, మీనా, శోభన, పింకిరెడ్డి, బి.గోపాల్‌, పీవీపీ, రఘురామకృష్ణమరాజు తదితరులు నెలరోజులపాటు కృషి చేసి ఈ ఎంపికలను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com