ఏప్రిల్ 28న వస్తున్న బాహుబలి 2 టికెట్స్ కోసం ధర్మ ప్రొడక్షన్స్ బంపర్ ఆఫర్
- April 07, 2017
దేశ వ్యాప్తంగా ఎన్ని సమస్యలున్నా అతి పెద్ద సమస్యగా భావిస్తున్న సమస్య కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడు.. ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు తెలుసుకోవడానికి జక్కన్న రాజమౌళి ఏప్రిల్ 28న ముహర్తం పెట్టాడు.. కాగా ఈ సినిమా కు టికెట్ ఎలా సంపాదించలా అని సినీ లవర్స్ తెగ ప్లాన్స్ వేస్తున్నారు.. తమ తమ పరిచయాలను గుర్తుకు చేసుకొనే పనిలో ఉన్నారు. బహుబలి 2 రిలీజ్ డేట్ దగ్గరకు రావడం తో ఎప్పుడెప్పుడు ఆన్ లైన్ లో టికెట్స్ పెడతారా అని అందరి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఆన్ లైన్ లో పెట్టిన వెంటనే హాట్ కేక్స్ లా పదినిమిషాల్లో బుక్ అయిపోవడం ఖాయం.. బాహుబలి టికెట్ సంపాదించడం అనేది సినీ ప్రేమికులకు ప్రశ్నార్ధకంగా మారిన వేళ ధర్మా ప్రొడక్షన్స్ వారు ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.. ఎటువంటి కష్టం లేకుండా బాహుబలి 2 ని మొదటి రోజునే చూసేలా ఒక బంపర్ ఆఫర్ ను ఇస్తున్నారు. ఆఫర్ పొందాలంటే ఏమి చేయాలంటే.. రేపు రిలీజ్ కానున్న బాహుబలి ది బిగినింగ్ ను మరో సారి చూడాలి అంటే.. అంటే.. బాహుబలి ది బిగినింగ్ సినిమా టికెట్ ను కొనుచేసిన వారికి సెకండ్ పార్ట్ టికెట్ పక్కా అని హామీ ఇవ్వనున్నారు.. హమ్మయ్య బాహుబలి 2 టికెట్ మొదటి రోజునే దొరుకుతుంది కనుక మొదటి పార్ట్ చేసేద్దాం అని రెడీ అయిపోతున్నారు.. ఈ ఆఫర్ కు కూడా కండిషన్స్ అప్లయ్ అంటున్నారు.. ఆ కండిషన్ ఏమిటో తెలుసా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ఐదు రాష్ట్రాల్లో వర్తించదట.. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆఫర్ ను అమలు చేస్తున్నారు.. బాహుబలి 2 సినిమాను మొదటి రోజునే ఏ మాత్రం కష్టపడకుండా చూడాలి అంటే ఈ 5 రాష్ట్రాలు మినహా మిగతా వారు ఫస్ట్ పార్ట్ ను చూడడానికి టికెట్ కొంటె సరి..
తాజా వార్తలు
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









