ఒకే వేదిక పై ఒక్కటి అవుతున్న బాలకృష్ణ, నాగార్జున
- April 07, 2017
తన పేరుతో సినిమా అవార్డులు ప్రకటించడం ఆ వేడుకల్ని అంగరంగ వైభవంగా చేయడం టి.సుబ్బిరామిరెడ్డికి మాత్రమే చెల్లింది. విశాఖపట్టణంలో జరుగుతున్న ఈ టి.ఎస్.ఆర్. అవార్డ్స్ ఫంక్షన్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాడు సుబ్బిరామిరెడ్డి.
ఎందరో టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు పాల్గొంటున్న ఈ వేడుకలలో ఈమధ్య కాలంలో దూరమైన బాలకృష్ణ నాగార్జునలను కలుపుతున్నాడు సుబ్బిరామిరెడ్డి. బాలకృష్ణ, నాగార్జున మధ్య సాన్నిహిత్యం దెబ్బతిన్నది అన్నది ఓపెన్ సీక్రెట్. వారిద్దరి మధ్యా సయోధ్యకోసం చాలామంది ప్రయత్నించినా ప్రస్తుతం వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడటం లేదు కదా కనీసం వారిద్దరిమధ్య పలకరింపులు కూడ లేవు.
ఒకవిధంగా చెప్పాలి అంటే వారిద్దరి మధ్య ఒక చిన్నపాటి అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉందని టాక్.
ఇలాంటి టైమ్ లో ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రాబోతున్నారు. టి.ఎస్.ఆర్ అవార్డుల వేదికపై నాగ్, బాలయ్య పరస్పరం ఎదురుపడబోతున్నారు. టి.ఎస్.ఆర్ అవార్డుల్లో భాగంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నాగార్జున పేరును, బెస్ట్ హీరో కేటగిరీలో బాలకృష్ణ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే.
స్వయంగా సుబ్బరామిరెడ్డి పిలిచారు కాబట్టి వీరిద్దరూ విశాఖపట్నం వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో గత కొంత కాలంగా పలకరించుకోని వీరు మీడియా కెమెరాలకు పోజులు ఇస్తూ నవ్వుతూ హడావిడి చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ అవార్డుల వేడుకకు నటీనటుల్ని ఎంపిక చేసినట్లు కాకుండా నటీనటుల కోసం అవార్డులు అన్నట్లుగా ఈ టి.ఎస్.ఆర్. అవార్డుల కార్యక్రమం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒక్కో ఏడాదికి కనీసం అరడజను మంది హీరోలకు వార్డులు ఇస్తున్నారు. ఉదాహరణకు 2016 సంవత్సరానికి ఉత్తమ నటుడుగా నాగార్జున - ఉత్తమ హీరోగా బాలకృష్ణ ఇదే సంవత్సరానికి బెస్ట్ నేషనల్ స్టార్ అంటూ ప్రభాస్‌కు ఇలా ఒకేసారి అనేక మంది హీరోలకు అవార్డులు సుబ్బిరామిరెడ్డి ఇవ్వడం పై కొందరు విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా బాలయ్య నాగర్జునలను కలిపిన ఘనత సుబ్బిరామిరెడ్డికి చెందుతోంది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









