దుబాయ్ క్రీక్‌కి ఐదు అధునాతన అబ్రాస్
- September 30, 2015
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) ఐదు అధునాతన అబ్రాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ అబ్రాస్‌లను డిజైన్ చేశారు. ఇవి దుబాయ్ క్రీక్‌లో ప్రయాణించనున్నాయి. ఐదు స్టేషన్లను కలిపే నాలుగు లైన్స్‌లో వీటిని నడుపుతారు. బనియాస్, అల్ సబ్‌కా, అల్ గుబైబా, దుబాయ్ ఓల్డ్ సౌక్ మరియు అల్ ఫహిది స్టేషన్‌లలో అబ్రాస్ అందుబాటులో ఉంటాయి. ఆర్టీఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ మరియు డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తయెర్ చెబుతూ, ఆర్‌టీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అబ్రాస్‌లను వినియోగించనున్నామని చెప్పారు. ఇంకో 12 కొత్త మెరైన్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్లను బిజినెస్ బే కెనాల్ మరియు దుబాయ్ వాటర్ కెనాల్‌ను 2018 నాటికి నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. తక్కువ బరువుతో, ఇంతకు ముందున్న అబ్రాస్‌కి మూడు రెట్ల వేగంతో కొత్త అబ్రాస్ దూసుకుపోతాయి. కెరాటలపై అద్భుతమైన సమతౌల్యం ఈ కొత్త అబ్రాస్‌ల సొంతం. 2017 నాటికి 50 అబ్రాస్‌లు, 2019 నాటికి 100, 2020 నాటికి 150 అబ్రాస్‌లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా అల్ టేలర్ వెల్లడించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









