ప్రయాణీకుడికి జైలు శిక్ష
- April 14, 2017
మొరాకోకి చెందిన వ్యక్తికి న్యాయస్థానం ఏడేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. అలాగే 23,000 ఖతారీ రియాల్జ్ జరీమానాను కూడా విధించడం జరిగింది. విమానంలో ప్రయాణిస్తూ, తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడమే నిందితుడు చేసిన నేరం. విమానంలో స్టీవార్డ్స్పై దాడి చేయడం, అలాగే అవమానించడం వంటి చర్యల ద్వారా నిందితుడు విమానంలో వీరంగం సృష్టించాడు. దోహాకి విమానం చేరుకోగానే అతన్ని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం అవసరమైన చర్యలు తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. అయితే తదుపరి అపీల్ కోసం నిందితుడు విజ్ఞప్తి చేయగా, అపీల్ కోర్ట్ దాన్ని తిరస్కరించింది. నిందితుడికి ఉన్న బ్యాడ్ క్రిమినల్ రికార్డ్ కారణంగా అపీల్‌కి అవకాశమివ్వలేదు. నిందితుడు మూడు చెక్ బౌన్సింగ్ కేసుల్లోనూ, ఒక మున్సిపల్ ఉల్లంఘన కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







