యు.ఏ.ఈ లో 'గల్ఫ్' సినిమాకు ప్రమోషనల్ అంబాసిడర్ల నియామకం

- April 14, 2017 , by Maagulf

గల్ఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అక్కడి కార్మికుల కష్టాలు కానీ గల్ఫ్ అంటే కష్టాలే కాదు ఎన్నో విజయ గాధల సమాహారం అనే నేపథ్యంతో 'శ్రావ్య ఫిలిమ్స్' బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కు యు.ఏ.ఈ లో పలువురిని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ప్రమోషనల్ అంబాసిడర్లగా నియమించారు.ఇంకా వేరే ఎమిరేట్స్ మరియు దేశాల్లో కూడా నియామకాలు జరుగుతున్నాయి.
త్వరలో మాగల్ఫ్ ద్వారా వివరాలు తెలియజేస్తారు.

శేఖర్ మల్యాల (అబుధాబి)
--------------------------

శేఖర్ మల్యాల తెలంగాణ,సతారం గ్రామం, జగిత్యాల జిల్లాకు చెందినవారు.ప్రస్తుతం అబుధాబిలో అల్ మన్సూరీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ సర్వేయరుగా పనిచేస్తున్నారు.

అభిరాం(ఫుజైరః)
-----------------------

అభిరాం ఆంధ్ర ప్రదేశ్, తెల్లదేవరాపల్లి గ్రామం,కృష్ణ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఫుజైరః లో  IL & FS ప్రైమ్ టెర్మినల్స్ కంపెనీ లో సీనియర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు.

అంబాసిడర్లగా నియమింపబడిన వారు గల్ఫ్ లో 'గల్ఫ్' చిత్రం గురించి అవగాహన కల్పించనున్నారు మరియు 'గల్ఫీ' ను ప్రమోట్ చేయనున్నారని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి వివరించారు.

ఈ సినిమాకు మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com