దుబాయ్ చరిత్రలో మరో కొత్త రికార్డ్
- April 14, 2017
2017 సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ గివింగ్'గా భావిస్తున్న నేపథ్యంలో దుబాయ్‌లోని సిఖ్ టెంపుల్ ఒకటి, ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. 600 మందికి 'బ్రేక్‌ఫాస్ట్'ని అందించింది. 101 దేశాలకు చెందినవారు గంట పాటు సాగిన ఈ బ్రేక్ ఫాస్ట్‌లో తమ తమ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. జబెల్ అలి ప్రాంతంలోని టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్‌లో చోటు కల్పించారు. గతంలో 55 దేశాలకు చెందినవారికి కాంటినెంటల్ బ్రేక్‌ఫాస్ట్ అందించింది. నూటెల్లా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇటలీలోని మిలాన్ ఎక్స్పో వద్ద సెప్టెంబర్ 13, 2015లో జరిగింది. ముందస్తు రిజిస్ట్రేషన్ ద్వారా ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రవేశం కల్పించారు. స్కూలు విద్యార్థులు, డిప్లమాట్స్, ప్రభుత్వ అధికారులు, సామాన్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యూఏఈలో 50 వేల మందికి పైగా విజిటర్స్‌కి భోజన సౌకర్యం కల్పిస్తోంది. ఈ గొప్ప కార్యక్రమానికి ఆ దైవ సహకారం తోడయ్యిందని సంస్థ ప్రతినిథులు తెలిపారు. మామూలు రోజుల్లో 1000 మందికి, వారాంతాల్లో, సెలవు దినాల్లో 10,000 మందికి గురుద్వారా భోజన సౌకర్యం కల్పిస్తోందని వారు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







