బుర్‌ దుబాయ్‌లో అగ్ని ప్రమాదం

- April 14, 2017 , by Maagulf
బుర్‌ దుబాయ్‌లో అగ్ని ప్రమాదం

దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ వర్గాలు, బుర్‌ దుబాయ్‌ ప్రాంతంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. మధ్యాహ్నం 3.21 నిమిషాల సమయంలో సివిల్‌ డిఫెన్స్‌కి అగ్ని ప్రమాదంపై సమాచారం అందింది. బ్రిటిష్‌ ఎంబసీకి దగ్గరలో ఈ భవనం ఉంది. ముందుగా ప్రమాదం సంభవించిన భవనం నుంచి క్షేమంగా అందర్నీ ఖాళీ చేయించారు. ఆ తర్వాత మంటల్ని ఆర్పివేశారు. దుబాయ్‌ పోలీస్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బాధితులైనవారు, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడ్డవారికి సివిల్‌ డిఫెన్స్‌ వర్గాలు ప్రాథమిక చికిత్సను అందించి, వారిని రషీద్‌ ఆసుపత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com