సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఆశీస్సులు విలన్ వారసుడికి

- April 15, 2017 , by Maagulf
సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఆశీస్సులు విలన్ వారసుడికి

1980, 90ల్లో విలన్ పాత్రలతో భయపెట్టిన సీనియర్‌ నటుడు చరణ్‌రాజ్‌ వారసుడు తేజ్‌ 'లాలి లాలి ఆరారో' చిత్రంతో హీరోగా ఆరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆడియోను సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చేతుల మీదుగా తమిళ ఉగాది రోజున ఆవిష్కరించారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసంలోనే ఈ కార్యక్రమం జరుగడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్, చరణ్‌రాజ్‌ కలిసి నటించిన 'బాషా' చిత్రం తాలూకా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం తేజ్‌ చరణ్‌రాజ్‌ హీరోగా గొప్ప స్థాయికి చేరుకోవాలని రజనీకాంత్ ఆశీర్వదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com