తొక్కిసలాటలో ఇంకా దొరకని వందలాది మంది ఆచూకీ
- October 01, 2015
ఇటీవల పవిత్ర మక్కా ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఆచూకీ ఇంకా తెలియరావడంలేదు. 769 మంది ఈ తొక్కిసలాటలో మరణించినట్లు అధికారికంగా వెల్లడైనా, అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 934గా ఉంది. 23 దేశాలకు చెందిన వారు మృతుల్లో ఉన్నారు. 600 మందికి పైగా వ్యక్తుల సమాచారం లభించకపోవడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. ఇరాన్‌కి చెందిన 239 చనిపోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ సంఖ్య ఇప్పుడు 464కి చేరింది. ఈ ఘోరానికి సౌదీ అరేబియా బాధ్యత వహించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. భారతదేశానికి చెందిన 51 మంది చనిపోగా, పాకిస్తాన్ నుంచి వచ్చినవారిలో 46 మంది చనిపోయినట్లు తేలింది. ఈజిప్ట్ నుంచి 75 మంది చనిపోగా 95 మంది ఆచూకీ తెలియలేదు. నైజీరియా 64 మంది మరణాన్ని ధృవీకరించగా, ఆ దేశానికి చెందిన 244 మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆచూకీ గల్లంతయినవారి కోసం పరిశోధనా చర్యలు ముమ్మరం చేసినా ప్రయోజనం లేకపోతోంది.
--మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









