పార్టీ పై స్పందించిన జూ. ఎన్టీఆర్...!!
- April 20, 2017
'నవ భారత్ నేషనల్ పార్టీ' పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీకి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అయింది. ప్రస్తుతం 'జైలవకుశ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న తారక్.. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట. తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట. ఇలాంటి పుకార్లకు తాను పట్టించుకోనని చెప్పాడట.
అంతేకాదు, ఈ వార్తలను ఎవరూ పట్టించుకోవద్దని, ఈ మ్యాటర్ ను ఇంతటితో వదిలేయాలని చెప్పాడట. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పటికిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తెలిపాడు. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ తరుపున జోరుగా ప్రచారం చేసిన జూఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం టీడీపీ పార్టీతో పాటు, ఎన్టీఆర్ అభిమానుల్లో పేద కలకలాన్నే రేపిందని చెప్పవచ్చు. అయితే ఇది ఎవరో పచ్చ పార్టీపై గిట్టని వారు చేసిన ప్రచారం కూడా అయ్యే అవకాశం లేకపోలేదు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









