అమెరికాకు రాయబారిగా ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్
- April 22, 2017
రియాద్: అమెరికాలో సౌదీఅరేబియా రాయబారిగా సౌదీ రాజు సల్మాన్.. తన కుమారుడు ఖలీద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ను నియమించారు. ఈ మేరకు సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. ‘అమెరికాకు రాయబారిగా ఉన్న ప్రిన్స్ అబ్దుల్లా బిన్ ఫైజల్ బిన్ టుర్కీని తొలగించి.. ఆ స్థానంలో ఖలీద్‌ను నియమించారు’ అని సౌదీ అధికారిక మీడియా పేర్కొంది. సల్మాన్ కేబినెట్లో మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ నియామకం చేపట్టినట్లు మీడియా వెల్లడించింది. దీంతోపాటు సైన్యానికి కూడా కొత్త అధిపతిని నియమిస్తూ.. రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రిన్స్ ఖలీద్ ఇప్పటివరకు ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా వ్యహరించారు. ఇస్లామిక్‌స్టేట్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన సంకీర్ణ దళాల యుద్ధవిమానాలకు పైలట్‌గా పనిచేశారు. కాగా.. సౌదీ రాజు సల్మాన్ మరో కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్.. ప్రస్తుతం రక్షణ మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు అమెరికాకు రాయబారిగా ఉన్న అబ్దుల్లా కేవలం ఏడాది క్రితమే ఆ బాధ్యతలు చేపట్టారు. కాగా.. ప్రస్తుతం కేబినెట్లో జరిగిన మార్పుల నేపథ్యంలో ఆ బాధ్యతలను సల్మాన్ తన కుమారుడికి అప్పగించారు. మరోవైపు ఒబామా నేతృత్వంలో సౌదీ, అమెరికా మధ్య సాన్నిహిత్యం అంతంత మాత్రంగానే ఉండేది. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. ఇది కూడా ఆ దేశానికి కీలక వ్యక్తిని రాయబారిగా నియమించడానికి ఓ కారణమైంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









