పిక్చర్ పెర్ఫెక్ట్ దోహా
- October 03, 2015
వాతావరణం కాస్త చల్లబడటంతో దోహాలో పర్యాటక స్థలాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అందమైన దృశ్యాల్ని బంధించేందుకు ఫొటోగ్రాఫర్లూ పోటీపడుతున్నారు. సోషల్ మీడియాలో దోహా అందాల్ని ఔత్సాహికులు పొందుపర్చుతున్నారు. ఖతార్ టూరిజం అథారిటీ కూడా దోహా సహా, ఖతార్‌లోని అందమైన ప్రాంతాల్ని ఇంకా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఖతార్, దోహా అందాల్ని ఆన్లైన్లో పొందుపర్చడం ద్వారా ప్రపంచ వ్యాపితంగా పర్యాటకులు ఈ అందాల్ని తిలకించడానికి మక్కువ చూపుతారని పేరొందిన ఫొటోగ్రాఫర్లు చెప్పారు. అక్టోబర్ 3న 50 మంది ఖతార్‌కి చెందిన ఫొటోగ్రాఫర్లతో వరల్డ్‌వైడ్ ఫొటో వాక్ని నిర్వహిస్తున్నారు. క్యాచెస్ ఆఫ్ లైట్-ఖతర్, డిపిఎస్సి, వెబ్ అలయన్స్ ఆఫ్ రాడికల్ ఫొటోగ్రాఫర్ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. ఫొటోగ్రాఫర్లందరికీ ఉచితంగానే 'రన్'లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఉదయం 5.30 నిమిషాల నుండి 8 గంటలవరకు పెరల్ మాన్యుమెంట్ ఎంఐఏ పార్క్ వరకు రన్ జరిగింది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







