రామ్‌గోపాల్ వర్మ బ్రూస్లీకి షాక్ ఇచ్చాడు
- October 03, 2015
బాక్సాఫీస్‌పై పవర్ ఫుల్ పంచ్‌లు విసిరేందుకు సిద్ధమవుతోంది రామ్‌చరణ్ బ్రూస్లీ. అయితే.. ఇంతలోనే రింగులోకి ఎంటరైంది రామ్‌గోపాల్ వర్మ బ్రూస్లీ..! రెడీ టూ ఫైట్ అంటూ సవాల్ చేస్తోంది. మరి, ఇంతకీ ఏ బ్రూస్లీ పవర్ చూపుతుంది..? అసలు వర్మ బ్రూస్లీ సంగతేంటి..?? అందరికీ షాక్ ఇచ్చిన వర్మ బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసేందుకు బ్రూస్లీగా మారాడు రామచరణ్. ఇవాళ ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ఈ చిత్రం.. ఈ నెల 16న వెండితెరపై సత్తాచాటేందుకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతుండడంతో కావాల్సినంత హైప్వచ్చేసింది రామ్‌చరణ్ బ్రూస్లీకి. అయితే.. ఈ సమయంలో అందరికీ షాక్ ఇచ్చాడు రామ్‌గోపాల్ వర్మ. తానూ ఒక బ్రూస్లీకి ప్రాణం పోశానని, అదికూడా సిల్వర్ స్క్రీన్‌పై పంచ్‌లు విసిరేందుకు సిద్ధమవుతోందని ప్రకటించాడు వర్మ. ఎప్పుడు మొదలు పెట్టాడో..? ఎంతవరకు వచ్చిందో తెలీదు కానీ..? ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు ఆర్జీవీ. అయితే.. పేరు బ్రూస్లీ అని పెట్టుకున్నప్పటికీ.. ఈ ట్రైలర్లో పోరాటాలు చేస్తున్నది మాత్రం ఓ యువతి. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్న వర్మ ఈ సినిమా గురించి మాట్లాడిన వర్మ.. గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. బ్రూస్లీ నటించిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా తనకు పిచ్చెక్కించిందన్న వర్మ.. ఆ చిత్రాన్ని 17 సార్లు చూశానని చెప్పారు. ఆ తరువాత వచ్చిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రాన్నైతే.. 23 సార్లు చూశానని చెప్పుకొచ్చారు. ఎంతో మందికి బ్రూస్లీ ప్రేరణగా నిలిచారని చెప్పిన రామ్‌గోపాల్ వర్మ.. ఆ కారణాలతో తన బ్రూస్లీ సినిమా కథను తయారు చేసుకున్నట్టు చెప్పాడు. ఎవరి బ్రూస్లీ సత్తాచాటబోతోంది..? అయితే.. రామ్‌చరణ్ బ్రూస్లీ రిలీజ్ కాబోతుండగానే తన బ్రూస్లీని ఎందుకు రంగంలోకి దించాడన్నది మాత్రం వర్మ చెప్పలేదు. మొత్తానికి తన.. మార్క్ కాంట్రవర్సీని మరోసారి ప్రూవ్ చేశాడు వర్మ. మరి, ఎవరి బ్రూస్లీ సత్తాచాటబోతోంది..? బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయేది రామచరణ్ బ్రూస్లీనా..? లేక రామ్‌గోపాల్ వర్మ బ్రూస్లీనా..? అన్నది సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే...
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







