ఇబ్రాలో తకాఫుల్‌ ఒమన్‌ ఇన్స్యూరెన్స్‌ బ్రాంచ్‌

- April 24, 2017 , by Maagulf
ఇబ్రాలో తకాఫుల్‌ ఒమన్‌ ఇన్స్యూరెన్స్‌ బ్రాంచ్‌

తకాఫుల్‌ ఒమన్‌ ఇన్స్యూరెన్స్‌ తాజాగా తన కొత్త బ్రాంచ్‌ని ఇబ్రాలో ప్రారంభించింది. వాలి ఆఫ్‌ ఇబ్రా షేక్‌ సక్కెర్‌ సుల్తాన్‌ అల్‌ షాకిలి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ని ఉద్దేశించి ఛైర్మన్‌ షేక్‌ రషీద్‌ సైఫ్‌ అల్‌ సౌఈ మాట్లాడుతూ కొత్త బ్రాంచ్‌ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెబుతూ, షేక్‌ షాకిలికి కృతజ్ఞతలు తెలిపారు. సిఇఓ డాక్టర్‌ సయ్యిదా రవాన్‌ అహ్మద్‌ అల్‌ సైద్‌, గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చారు. అలాగే ప్రముఖులకు థ్యాంక్స్‌ చెప్పారు. ఇబ్రాలో కొత్త బ్రాంచ్‌ ప్రారంభం గొప్ప అనుభూతినిచ్చిందనీ, రెసిడెంట్స్‌కి మెరుగైన ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తామని వివరించారామె. 2015లో తకాఫుల్‌ ఒమన్‌ ఇన్స్యూరెన్స్‌ ప్రారంభమయ్యింది. షరియా అప్రూవ్డ్‌ ఇన్స్యూరెన్స్‌ ప్రోడక్స్‌ ద్వారా అనతి కాలంలోనే అత్యంత పాపులర్‌ అయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com