రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం క్షీణత

- April 24, 2017 , by Maagulf
రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం క్షీణత

జరిగాయి. 2016లో ఇదే క్వార్టర్‌లో 1,257 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరిలో 318, ఫిబ్రవరిలో 287, మార్చిలో 290 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 691 (తగ్గుదల 16.3 శాతం) కాగా, మరణాల సంఖ్య 150 (తగ్గుదల 6.3 శాతం) నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ఒమనీయుల సంఖ్య 19.2 శాతం తగ్గి, 516గా నమోదైంది. ఇందులో 144 మంది మహిళలు. చనిపోయినవారి సంఖ్య 108 కాగా, అందులో 24 మంది మహిళలు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వలసదారుల సంఖ్య 175 కాగా, మరణించిన వలసదారులు 42 మంది. ఇవి కూడా గత ఏడాదితో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. మార్చిలో మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com