దేవీ శ్రీ ప్రసాద్ నృత్య దర్శకుడిగా మారాడు
- October 03, 2015
సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫాంలో ఉన్న దేవీ శ్రీ ప్రసాద్ మరో కొత్త అవతారం ఎత్తుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలకు సంగీతం అదించటంతో పాటు అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా మెరుస్తున్న దేవీ తాజాగా కొరియోగ్రాఫర్ గా మారాడు. రెగ్యులర్ గా తన సినిమాల ఆడియో ఫంక్షన్స్ తో పాటు, ప్రమోషనల్ వీడియోస్ లో కూడా తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ చూపిస్తున్న ఈ సంగీత తరంగం.. 'కుమారి 21 ఎఫ్' సినిమా కోసం నృత్య దర్శకుడిగా మారాడు. తనే సంగీతం అందించిన ఓ ఫంకీ సాంగ్ కోసం స్టెప్స్ కూడా కంపోజ్ చేస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ మిత్రుడు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న 'కుమారి 21 ఎఫ్' సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కథ స్క్రీన్ ప్లే మాటలు సుకుమార్ అందిస్తుండగా, ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







