కల్పనా చావ్లా బయోపిక్ లో ప్రియాంక చోప్రా.!
- April 25, 2017
అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కల్పనా చావ్లా పాత్ర పోషిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుపై గత ఏడేళ్లుగా పనిచేస్తున్నానని నూతన డైరెక్టర్ ప్రియామిశ్రా అన్నారు. కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.ప్రియాంక ప్రస్తుతం తన అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ షూటింగ్లో ఉన్నారు. దీంతోపాటు ఆమె హాలీవుడ్ సినిమా ‘బేవాచ్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవల్లో మార్పులు..







