గోపీచంద్ 'గౌతమ్ నంద' హీరో.. విలన్ కూడా

- April 27, 2017 , by Maagulf
గోపీచంద్ 'గౌతమ్ నంద' హీరో.. విలన్ కూడా

యాక్షన్ హీరో గోపీచంద్ 'గౌతమ్ నంద'గా రాబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ లు జతకట్టనున్నారు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. డబుల్ యాక్షన్ చేయడం గోపీచంద్ కి ఇదే తొలిసారి.
ఇప్పుడీ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. గౌతమ్ నంద.. ఒకరు కాదు ఇద్దరన్న విషయం స్పష్టమైంది. అయితే, హీరో, విలన్ గా కూడా గోపీచంద్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో జయం, వర్షం, నిజం.. సినిమాల్లో విలన్ గా కనిపించాడు గోపీచంద్. గోపీని హీరో కంటే విలన్ గా చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 'గౌతమ్ నంద' ఆ కోరిక తీర్చబోతున్నాడు గోపీ.
వచ్చే నెలలో 'గౌతమ్ నంద'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్. ఎస్. థమన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com