ఫ్రూట్స్‌లో పెస్టిసైడ్స్‌: ఇకపై మరింత అప్రమత్తం

- April 28, 2017 , by Maagulf
ఫ్రూట్స్‌లో పెస్టిసైడ్స్‌: ఇకపై మరింత అప్రమత్తం

ఇంపోర్టెడ్‌ ఫుడ్‌ ఐటమ్స్‌కి సంబంధించి ఇకపై మరింత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించనున్నారు. కూరగాయలు, అలాగే ఫ్రూట్స్‌ని ఇంపోర్ట్‌ చేసుకుంటున్న సమయంలో ఆయా ఉత్పత్తుల్లో మోతాదుకి మించిన పెస్టిసైడ్స్‌ అవశేషాల్ని అధికారులు కనుగొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, తాజాగా ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. లెబనాన్‌, ఒమన్‌, ఈజిప్ట్‌ మరియు జోర్డాన్‌ నుంచి వచ్చే ప్రోడక్ట్‌లను తనిఖీలు చేయాలని ఈ సర్క్యులర్‌లో అధికారులకు సూచించారు. ఈజిప్ట్‌ నుంచి వచ్చే పెప్పర్‌ అలాగే, క్యాబేజీ, కాలీ ఫ్లవర్‌, స్క్వాష్‌, బీన్స్‌, ఎగ్‌ప్లాంట్‌ (జోర్డాన్‌), లెబనాన్‌ నుంచి వచ్చే యాపిల్స్‌, స్వీట్‌ లెమన్‌, వాటర్‌క్రిసెస్‌ (ఒమన్‌) వంటివి ఇందులో ఉన్నాయి. అన్ని ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ తాలూకు శాంపిల్స్‌ని విధిగా పరిశీలించాలనీ, అవసరమైన పరీక్షలు నిర్వహించాలనీ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తేలితే వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే ఈ తరహా కఠిన నిబంధనలతో ఇంపోర్ట్స్‌ తగ్గిపోతాయని, తద్వారా సరుకు లభ్యత తగ్గిపోతుందని, డిమాండ్‌ పెరిగి ధరలు కూడా పెరిగిపోతాయని రిటైల్‌ ఛెయిన్‌కి సంబంధించిన ఓ స్టోర్‌ యజమాని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com